మాట్లాడితే మీనింగ్ ఉండాలంటారు. అదేంటో కొంతమంది మైకు పట్టుకొంటి అది తప్ప అన్నీ ఉంటాయ్. రాఖీ సావంత్ మాట్లాడినా అంతే. ఇది వరకు సినీ నటి హోదాలో మాట్లాడినప్పుడు… ఆమె మాటలు భలే పసందుగా అనిపించేవి. ఇప్పుడు రాజకీయాల్లోకి చేరింది కదా. తాను కూడా… మిగిలిన వాళ్లలానే అడ్డదిడ్డంగా, అర్థం పర్థం లేని విధంగా మాట్లాడుతోంది. చిన్నారి పెళ్లి కూతురు ఆనందిని ఉరఫ్… ప్రత్యూష మిస్టరీ పై రాఖీ తనదైన శైలిలో గళం ఎత్తింది. ప్రత్యూష మరణం వెనుక.. ఆమె బోయ్ ఫ్రెండ్ ఉన్నాడని, ప్రత్యూషది ఆత్మహత్య కాదు.. హత్య అంటోంది. అంత వరకూ బాగానే ఉంది. అయితే ఆ తరవాతే సిల్లీ కామెంట్లు చేసింది.
ప్రత్యూష ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ ఉండడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకొందని, అమ్మాయిల ఆత్మహత్యలు చేసుకోవడానికి సీలింగ్ ఫ్యాన్లే కారణమని, వాటిని ప్రభుత్వం నిషేధించాలని ఏదోదే వాగేసింది. అంతేకాదు. ఇళ్లల్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్లను పీకేయాలని, ఏసీలు పెట్టించాలని, లేదంటే కూలర్లు వాడాలని సలహా ఇచ్చింది. పనిలో పనిగా ప్రత్యూషకు ప్రభుత్వం రూ.5 కోట్లు నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. నిర్భయ చట్టాల గురించి మాట్లాడాల్సిన రాఖీ సావంత్ అటు తిరిగి ఇటు తిరిగి సీలింగ్ ఫ్యాన్లవైపు పడిందేంటి చెప్మా..??? బహుశా.. కొత్తగా రాఖీ ఏసీ కంపెనీ డీలర్ షిప్ ఏమైనా తీసుకొందేమో.. అందుకే ఏసీలు వాడండంటూ ఇలా ప్రచారం చేస్తోంది. మొత్తానికి ప్రత్యూష ఆత్మహత్య అనే సీరియస్ ఇష్యూని రాఖీ ఇలా సీలింగ్ ఫ్యాన్ పేరుతో సిల్లీగా మార్చేసింది.