ఒకవైపు రాజశేఖర్, మరోవైపు తేజ.. ఇద్దరికీ ముక్కుమీదే కోపం ఉంటుంది. అందుకే వీరిద్దరి కాంబినేషన్లో అహం అనే సినిమా వస్తోందంటే.. చిత్రసీమ సైతం షాక్ తింది. ఈ కాంబినేషన్ వర్కవుట్ అవ్వుద్దా?? అని సందేహించింది. ఆ అనుమానమే ఇప్పుడు నిజం అవ్వబోతోందని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. అహం సినిమా నుంచి రాజశేఖర్ బయటకు వచ్చేశాడని, ఈ సినిమా మొదల్వకముందే.. ఆగిపోయిందని టాలీవుడ్ టాక్. రాజశేఖర్ ప్రతినాయకుడిగా ఈ సినిమాతో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాల్సివుంది. తేజ కూడా స్ర్కిప్టు సిద్ధం చేసుకొన్నాడు. అయితే.. షూటింగ్ ఇంకొద్ది రోజుల్లో మొదలవుతుందనగా… తేజ, రాజశేఖర్ లమద్య విబేధాలొచ్చాయని టాక్. దాంతో.. రాజశేఖర్ తనకు తానుగా ఈ సినిమా నుంచి డ్రాప్ అయ్యాడని చెప్పుకొంటున్నారు.
అటు తేజకీ, ఇటు రాజశేఖర్‌కి ఓ విజయం అవసరం. ఇద్దరూ నిరూపించుకొనే ప్రయత్నాల్లోనే ఉన్నారు. దాంతో ఈ కాంబినేషన్ లో సినిమా అంటే.. జనాల్లో ఆసక్తి పెరిగేది. అయితే.. ఇద్దరూ మాటా మాటా అనుకొని.. ఈ సినిమాని వదులుకోవడం నిరాశ కలిగించే విషయమే. ఇద్దరిలో ఎవరు తమ `అహం` పక్కన పెట్టినా… ఈ `అహం` ఎప్పుడో పట్టాలెక్కేద్దును. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. ఇద్దరిలో ఒకరు కామ్ అయినా.. షూటింగ్ మొదలైపోతుంది. మరి ఆ ఒక్కరూ ఎవరన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.