ఇప్పుడు ఎక్కడ చూసినా సర్దార్ మేనియానే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ గా మరోసారి తన స్టామినా ఏంటో చూపించనున్నాడు. రిలీజ్ కు ఇంకా ఒక్కరోజే గ్యాప్ ఉండటంతో సినిమా చూసేందుకు అభిమానులంతా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని వారం ముందు నుండే టికెట్స్ ఇచ్చేయడంతో ఇప్పుడు మల్టీప్లెక్స్ ల మీద పడుతున్నారు. కేవలం తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా సర్దార్ హంగామా అలానే ఉంది.
యూ.ఎస్ లో 200 లొకేషన్స్ లో సినిమా రిలీజ్ అవుతుంది. ఇక టికెట్ ప్రైజ్ కూడా పాతిక డాలర్స్ కు అమ్ముతున్నారు అయినా సరే వీకెండ్ బుకింగ్ అదరగొట్టేస్తున్నాయని తెలుస్తుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో 1500 థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సర్దార్ బాలీవుడ్ లో 800 థియేటర్స్ రిలీజ్ అవుతుంది. ఇక ఓవర్సీస్ అన్ని కలుపుకుని మొత్తం 3000 థియేటర్స్ లో పవర్ స్టార్ హంగామా చేయబోతున్నాడు.
మరి ఇన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్న సర్దార్ మొదటి రోజు 20 కోట్ల వసూళు చేసేలా ఉన్నాడు. ఇక సినిమా కనుక హిట్ టాక్ వస్తే అంచనాలకు అందని కలక్షన్స్ సర్దార్ వసూళు చేసే అవకాశం ఉంది. మరి సర్దార్ ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడో మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.