తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగ యువకులకు ఊహించని వరమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలలో 15,000 ఖాళీలను భర్తీ చేసేందుకు అనుమతిస్తూ ఆయన శనివారం సాయంత్రం సంబంధిత ఫెయిల్ పై సంతకం చేసారు. అంతే కాదు నిరుద్యోగుల వయో పరిమితిని కూడా ఏకంగా 10 ఏళ్ళు పెంచేశారు. అంటే ప్రస్తుతం 36సం.లు ఉన్న వయోపరిమితి 46సం.లుగా మార్చారన్నమాట!వయోపరిమితి కారణంగా ప్రభుత్వోద్యోగాలు పొందే అవకాశ్యం కోల్పోతున్న నిరుద్యోగ యువతకు ఇది ఊహించని వరమే!
మొదట వ్యవసాయం, వైద్యం, విద్యుత్, ఎక్సైజ్, మునిసిపల్, పోలీస్ శాఖలలో ఖాళీలను భర్తీ చేస్తారు. వాటిలో పోలీస్ మరియు దాని అనుబంధ శాఖలలో మొత్తం 8000ఖాళీలను భర్తీ చేస్తారు. అదేవిధంగా విద్యుత్ శాఖలో 2681, మిగిలిన అన్ని శాఖలలో కలిపి మొత్తం 4,300 ఖాళీలను భర్తీ చేస్తారు. చిరకాలంగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఇదో చాలా తీపే కబురే!