డిల్లీ, ముంబై, గోవాలలో ఉగ్రవాదులు దాడులు చేయవచ్చని కేంద్ర నిఘా సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ నుంచి కాశ్మీర్ ద్వారా భారత్ లోకి ముగ్గురు ఉగ్రవాదులు మారణాయుధాలతో ప్రవేశించినట్లు నిఘా సంస్థ కనుగొంది. వారు ముగ్గురూ “జె.కె.-01-ఎబి-2645” అనే నెంబరు గల సిమెంటు రంగు స్విఫ్ట్ కారులో పంజాబ్ లోని బనిహాల్ సొరంగ మార్గం వైపు ప్రయాణించినట్లు నిఘా వర్గాలు కనుగొన్నాయి. వారితో బాటు ఆ కారులో ఒక స్థానికుడు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. బహుశః అతను ఉగ్రవాదుల సానుభూతిపరుడు కానీ లేదా వారి చేత కిడ్నాప్ చేయబడిన ఆ వాహన యజమాని గానీ కావచ్చునని అనుమానిస్తున్నాయి. ముగ్గురు ఉగ్రవాదులు డిల్లీ, ముంబై, గోవాలలో విద్వంసం సృష్టించేందుకు బయలుదేరినట్లువారి ఫోన్ సంభాషణల ద్వారా కనుగొన్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. కనుక ఈ మూడు నగరాలలో పోలీసులు హై-అలర్ట్ ప్రకటించి, నగరాలలోకి వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనికీలు చేయడం మొదలుపెట్టారు.