భాజపా అధిష్టానం కొద్దిసేపటి క్రితమే ఐదు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను నియమిస్తూ ప్రకటన జారీ చేసింది. తెలంగాణా రాష్ట్రానికి ఆ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఉన్న డా. లక్షణ్, కర్నాటకకి ఎడ్యూరప్ప, అరుణాచల్ ప్రదేశ్- తాపిర్ గావ్, పంజాబ్-విజయ్ సంప్ల, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి కేశవ్ ప్రసాద్ లను అధ్యక్షులుగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సోము వీర్రాజు, పురందేశ్వరి, ప్రస్తుత అధ్యక్షుడు కంబంపాటి హరిబాబులలో ఎవరో ఒకరిని అధ్యక్షులుగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు లేదా రేపటిలోగా వారు ముగ్గురిలో ఒకరిని అధ్యక్షులుగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.