పవన్ కల్యాణ్ అనగానే విరుచుకుపడిపోయే కమాల్ ఖాన్ మరోసారి పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గబ్బర్ సింగ్ సినిమాకి ముంబైలో థియేటర్‌లో పది మంది కూడా కనిపించరని, అలా కనిపిస్తే… తెలుగు రాష్ట్ర్రాల్లో నగ్నంగా తిరుగుతానని ప్రకటించిన కమాల్ ఖాన్.. ఇప్పుడు మరింతగా రెచ్చిపోతున్నాడు. తెలుగులోనే కాదు, బాలీవుడ్‌లో కూడా సర్దార్ సినిమా అట్టర్ ఫ్లాప్ అని రివ్యూలో చెబుతున్నాయని, పవన్ కెరీర్‌లో ఇది నెం.1 ఫ్లాప్ చిత్రమని తీర్మాణించేశాడు కమాల్ ఖాన్.
అక్కడితే ఆగలేదు. ‘పవన్ కళ్యాణ్ సార్, మీ సర్దార్ గబ్బర్ సింగ్ బిగ్గెస్ట్ ఫ్లాప్, మీరు ఇప్పుడు రెండు రూపాయల స్టార్. కాబట్టి నా దేశ్ ద్రోహి 2 సినిమాలో నటించి తిరిగి సూపర్ స్టార్ గా ఎదగండి’ అంటూ కామెంట్ చేశాడు. అయితే కమాల్ ఖాన్‌ని ఈసారి కెలికిందీ రాంగోపాల్ వర్మనే. సర్దార్ సినిమాపై నీ అభిప్రాయం చెప్పమంటూ కమల్‌ఖాన్‌కి రీ ట్వీట్ చేశాడు. ఈయనేమో.. ఇలా రెచ్చిపోయాడు. చూస్తుంటే వర్మ. కమాల్ ఖాన్‌లు ఇద్దరూ కలిసి పవన్ ఇమేజ్ డామేజ్ చేయడానికి చేస్తున్న ట్వీట్ల నాటకంలా ఉంది ఈ ఎపిసోడ్.