పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ నిన్న తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే సినిమా కేవలం పవన్ అభిమానులకు మాత్రమే అన్నట్టు ఉండటంతో సగటు ప్రేక్షకుడు సినిమాను చూసి పెదవి విరుస్తున్నారు. సినిమాకు వచ్చిన డివైడ్ టాక్ సినిమా కలక్షన్స్ మీద ఎంత ప్రభావితం చేస్తుంది అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఓవర్సీస్, బాలీవుడ్ లో ఈ సినిమా ఘోర వైఫల్యం పొందినట్టు తెలుస్తుంది.
అయితే సర్దార్ సినిమాకు పోటీ తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు వెనుకడుగు వేసిన దర్శక నిర్మాతలు ఇప్పుడు సర్దార్ కు పోటీగా వచ్చేందుకు రెడీ అయ్యారు. ముఖ్యంగా తమిళ హీరో విజయ్ ‘తెరి’ తెలుగులో ‘పోలీసోడు’గా వస్తున్నాడు. కోలీవుడ్ లో సినిమా ఏప్రిల్ 14న గ్రాండ్ గా రిలీజ్ అవుతుండగా ఇక్కడ కూడా అదే డేట్ కన్ఫాం చేద్దామనుకుంటే.. సర్దార్ ధాటికి అది తట్టుకుంటుందో లేదో అని ఇప్పటిదాకా రిలీజ్ డేట్ కన్ఫాం చేయలేదు. తెలుగులో ఈ సినిమాను దిల్ రాజు రిలీజ్ చేస్తుండటం విశేషం.
మరి సర్దార్ ఎలాగు యావరేజ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి పోలీసోడికి బలం చేకూరినట్టే. ఏప్రిల్ 14 వదిలేస్తే ఆపై వచ్చే వారం, అంటే ఏప్రిల్ 22న అల్లు అర్జున్ తన ‘సరైనోడు’ సినిమాతో వస్తున్నాడు. కాబట్టి ఏప్రిల్ 14నాడే పోలీసోడికి ముహుర్తం ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు దిల్ రాజు. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు రేపట్లో వచ్చే అవకాశం ఉంది.