స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూటే సెపరేట్.. మెగా ఇమేజ్ కాకుండా కెరియర్ మొదలు పెట్టిన రెండు మూడు సినిమాలతోనే తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ ను ఏర్పరచుకున్నాడు. ఇక మనోడు స్టైలిష్ యాక్షన్ కు మెగా అభిమానులు ఫిదా అయ్యారు. స్టార్ హిరోల సినిమాల్లో హ్యాట్రిక్ 50 కోట్ల కలక్షన్స్ సాధించిన ఘనత బన్నిదే.. అయితే ప్రస్తుతం సరైనోడు ప్రమోషన్స్ లో హడావిడి ఉన్న అల్లు అర్జున్ తన తర్వాత సినిమా మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
కొంతమది కోలీవుడ్ డైరక్టర్ లింగుస్వామితో బన్ని సినిమా ఖాయమైందని అంటుంటే.. మరికొంతమంది విక్రం కుమార్ తో బన్ని సినిమా అంటూ హడావిడి చేశారు. అయితే నిన్న బన్ని పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ హారిక అండ్ కాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ (చినబాబు) విశెష్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేకాదు పోస్టర్ లో దర్శకుడు త్రివిక్రం పేరు కూడా ఉంది. సో దీన్ని బట్టి బన్ని మరోసారి త్రివిక్రం కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాడని కన్ఫాం అయ్యింది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తిలతో చేసిన రెండు సినిమాలను హిట్ కొట్టిన ఈ క్రేజీ కలయికలో మరో సినిమా అంటే అది కచ్చితంగా ట్రెండ్ క్రియేట్ చేయడం ఖాయం. మరి సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.