నా జీవిత ప్రయాణంలో దొరికిన అద్భుతమైన కథ వంగవీటి.. అంటూ ఆర్భాటంగా వంగవీటి అనే సినిమాని మొదలెట్టాడు రాంగోపాల్ వర్మ. అంతేకాదు.. తెలుగులో తనకు ఇదే చివరి సినిమా అని, వంగవీటి లాంటి కథ తనకు భవిష్యత్తులో దొరకదని ముందే తెలిసి.. సినిమాలకు దూరం అవుతున్నా.. అని చెప్పాడు. అయితే.. ఇప్పుడు వంగవీటినీ గాలికి వదిలేశాడట వర్మ. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. షూటింగ్ విజయవాడలో అయితే… వర్మ మాత్రం హైదరాబద్‌లో షికార్లు కొడుతున్నాడు. అసలు వంగవీటి సెట్లనే వర్మ అడుగుపెట్టడం లేదని, సినిమా అంతా తన సహాయ దర్శకులకు వదిలేసి.. ఫోన్లో సలహాలూ సూచనలూ ఇస్తున్నాడట. సెట్లో ఏం తీస్తున్నారో.. సాయింత్రం తీరిగ్గా చూసుకొని ఎడిట్ చేయిస్తున్నాడట.
మొత్తానికి వర్మ బాగా రిలాక్స్ అయిపోయాడు. ఎంత తీసినా.. ఎన్ని వేషాలేసినా జనాలు చూడడం లేదు కదా? అని వర్మ ఇలా ఫిక్సయిపోయాడా? లేదంటే పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇలాక్కూడా వాడుకోవచ్చని డిసైడ్ అయ్యాడా..? అలాగైతే ఆడియన్సూ అంతే కదా?? థియేటర్‌కి వెళ్లి సినిమా చూడ్డం ఎందుకూ అని పెన్ డ్రైవ్ లో వచ్చేంత వరకూ ఆగుతారు. వర్మ కంటే.. ఆడియన్స్ తెలివైన వాళ్లు కదా??