సర్దార్ గబ్బర్‌సింగ్ తొలిరోజు ప్రభంజనం సృష్టించింది. టాక్ ఎలాగున్నా సరే.. ఆ వసూళ్లు చూసి ముచ్చట పడిపోతున్నారు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. చాలా ఏరియాల్లో తొలిరోజు వసూళ్లు బాహుబలి వసూళ్లకంటే మిన్నగా ఉన్నాయి. కనీసం పది లక్షల మార్జిన్‌లో బాహుబలి వసూళ్లు క్రాస్ చేసి రికార్డు సృష్టించింది సర్దార్. అయితే ఆ ఎఫెక్ట్ వెనుక… ఈ ప్రభంజనం వెనుక టీడీపీ సర్కార్ మద్దతున్నట్టు క్లియర్ కట్‌గా అర్థమవుతోంది.
ఏపీలో సర్దార్‌కి కావల్సినన్ని థియేటర్లు దొరికాయి. బెనిఫిట్ షోల కోసం ఎన్ని థియేటర్లు అడిగితే అన్నిచ్చారు. సాధారణంగా బెనిఫిట్ షో అనగానే కొన్ని థియేటర్లకే పరిమితం చేస్తారు. కానీ సర్దార్‌కి ఆ నిబంధనలు వర్తించలేదు. మరీ ముఖ్యంగా తెలగుదేశం పట్టుబాగా ఉన్న విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో సర్దార్ ప్రభంజనం ఏ రేంజులో సాగింది. కనిపించిన ప్రతీ థియేటర్‌లోనూ బెనిఫిట్ షో పడిపోయింది. టికెట్ రూ.1000 ఎక్కడా తగ్గలేదు. కొన్ని థియేటర్లో రూ.3000 లకు కూడా అమ్మేశారు. ఎక్కడా పోలీసులు అబ్జెక్షన్ చెప్పలేదు. తెలంగాణలో కూడా సర్దార్‌కు స్పీడు బ్రేకర్లు వేయడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదు. గత ఎన్నికల్లో టీడీపి సపోర్ట్ చేసి, అధికార పగ్గాలు అందివ్వడంలో కీలక భూమిక పోషించిన పవన్ కల్యాణ్ కి టీడీపీ ఈ రకమైన మద్దతు ఇచ్చిందన్నమాట.