అద్భుత గాత్రానికి అందం తోడైతే టాప్ సెలబ్రిటీ స్టేటస్ వెతుక్కుంటూ వచ్చేస్తుంది. లక్షల మంది అభిమానులను తెచ్చేస్తుంది. అలాంటి వాళ్లలో ఒకరు, బ్యూటీఫుల్ సింగర్ మరియా కరే. స్టన్నింగ్ బ్యూటీ మరియా పాటలు వింటే మైమరచి పోయే వాళ్లు మిలియన్లలోనే ఉన్నారట. కోట్లాది మంది మెస్మరైజ్ చేసే ఈ అందాల భామ, అద్భుత గాయని తనకు అంతులేని సంపద తెచ్చిన వోకల్ కార్డులకు చాలా శ్రద్ధ పెట్టింది. అందుకే తన స్వర తంత్రులను, అంతే వోకల్ కార్డులను బీమా చేయించింది.
మరియా వాకల్ కార్డులను 35 మిలియన్ డాలర్లకు బీమా చేయించుకుంది. భారతీయ కరెన్సీలోచెప్పాలంటే 230 కోట్ల రూపాయల పైమాటే. ఆమె గొంతే కాదు, కాళ్లు కూడా చాలా బాగుంటాయని టాక్. ఆమెను లెగ్గీ లేడీ అని కూడా పిలుస్తారు. అందుకే లెగ్స్ ఆఫ్ ఎ గాడెస్ అని ఓ పదేళ్ల క్రితం ఆమెకు పురస్కారం కూడా వచ్చింది. అంత, తన కాళ్లను కూడా బీమా చేసి పారేసింది. వాటినీ 35 మిలియన్ డాలర్లకు బీమా చేసేసింది. టోటల్ గా ఆమె శరీర అవయవాల్లోని వోకల్ కార్డులు, కార్డుల విలువ 460 కోట్ల రూపాయలన్న మాట.
అమెరికాలో, ఇతర దేశాల్లో సెలబ్రిటీలు తమ శరీర భాగాలను భారీ మొత్తానికి బీమా చేయించడం కొత్తేమీ కాదు, ఆ మధ్య మిలీ సైరస్ తన నాలుకను మిలియన్ డాలర్లకు బీమా చేయించుకుంది. అందాల తార హీదీ క్లమ్ తన కాళ్లను 2 మిలియన్ డాలర్లకు బీమా చేయించింది. జేమ్స్ బాండ్ నటుడు డేనియల్ క్రేగ్ తన మొత్తం శరీరాన్ని 9.5 మిలియన్ డాలర్లకు బీమా చేయించాడు. అందాల గాయని, నటి జెన్నిఫర్ లోపెజ్ తన పిరుదులు 27 మిలియన్ డాలర్లకు బీమా చేయించింది. ఇంకా ఎంతో మంది సెలబ్రిటీలు తమ శరీర భాగాలను భారీ మొత్తానికి బీమా చేయించుకుని నిశ్చింతగా ఉన్నారట.