చిరంజీవి 150వ సినిమా గురించి.. ఎంత కాలం ఆలోచించారో? ఎన్నేళ్లు టైమ్ వేస్ట్ చేశారో? చివరికి ఏరి కోరి తమిళ సినిమా కత్తి హక్కుల్ని కొని.. తన కుటుంబానికి బాగా కావల్సిన వినాయక్ చేతిలో పెట్టాడు. ఆ సినిమాకి కత్తిలాంటోడు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. తన పాత్ర కోసం గడ్డం కూడా పెంచుతున్నాడు చిరు. అంతా బాగానే ఉంది. కానీ స్ర్కిప్టు తెలుగీకరించడంలోనే వినాయక్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు టాక్. మరీ ముఖ్యంగా చిరంజీవిని వినాయక్ శాటిస్పై చేయలేకపోతున్నాడట. ఇప్పటికే రెండు దఫాలు స్ర్కిప్టు మార్చాడట వినాయక్. అయినా సరే.. ఇది బాలేదు.. అది బాలేదు.. అంటూ చిరంజీవి మార్పులూ చేర్పులూ చెబుతున్నాడట.
ఈ విషయంలో వినాయక్ కూడా కాస్త అసంతృప్తికి గురవుతున్నా.. చిరంజీవి 150వ సినిమా ప్రెస్టేజియస్ ఇష్యూ కాబట్టి, చిరుతో సర్దుకు పోతున్నాడట. ఈ నెలాఖరు కల్లా పూర్తి స్ర్కిప్టు చేతిలో పెట్టాలని డెడ్లైన్ ఇచ్చాడట చిరు. రీమేక్ సినిమా విషయంలోనూ ఇన్ని తర్జన భర్జనలా?? ఆల్రెడీ కథేంటో తెలుసు, క్యారెక్టరైజేషన్లు తెలుసు.. అయినా సరే చిరు ఇంతలా నాన్చుతున్నాడంటే.. సొంత కథైతే ఇంకెన్ని తిప్పలు పెట్టేవాడో??