ఈనాటి కథానాయికలకు మార్కెట్ లెక్కలు, గ్లామర్ సూత్రాలూ బాగా తెలుసు. నాలుగు అవకాశాలు చేజిక్కించుకోవాలంటే ఏం చేయాలో… బాగా అర్థం చేసుకొన్నారు. ఒంపు సొంపులున్నప్పుడే.. అవకాశాలు ఒడిసిపట్టుకొని, స్థిరపడిపోవాలని ఫిక్సయ్యారు. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధమే. గ్లామర్ గా కనిపించడానికి హాట్ హాట్ పోజులివ్వడానికి ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. అందులోనూ పోటీ ఎక్కువాయె. ఏమాత్రం నెమ్మదించినా.. మరొకరు దూసుకుపోతుంటారు. అందుకే రాశీఖన్నా కూడా పద్ధతి మార్చేస్తోంది. సినిమా సినిమాకీ గ్లామర్ డోసు బాగా పెంచేస్తోంది. బెంగాల్ టైటర్లో తమన్నాకే మతిపోయేలా రెచ్చిపోయిన రాశీ ఇప్పుడు సుప్రిమ్లోనూ అంతే ఇదిగా అందాల ప్రదర్శనకు దిగిపోయిందని సమాచారం.
సాయిధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదో మాస్ మసాలా యాక్షన్ సినిమా. దిల్రాజు సినిమాలంటే.. ఫ్యామిలీ టచ్ ఉంటుంది గానీ, ఈ సినిమాలో మాత్రం.. గ్లామర్నీ మసాలానీ బాగా దట్టించారట. అందుకు అనుగుణంగానే రాశీ రెచ్చిపోయిందని టాక్. రెండు పాటల్లో రాశీ కాస్ట్యూమ్స్ చూస్తే కుర్రకారుకి మతులు పోవడం ఖాయం అంటున్నారు సీనీ జనాలు. ఈ సినిమా గనుక క్లిక్కయితే రాశీ ఎక్కడికో వెళ్లిపోతుందని జోస్యం కూడా చెబుతున్నారు. రాశీ ఎంట్రీ.. తన గ్లామర్ ఏ రేంజులో ఉంటుందో తెలియాలంటే సుప్రీమ్ వచ్చేంత వరకూ ఆగాలి.