త్రివిక్రమ్ సినిమా అంటే పంచ్‌లు పడాల్సిందే. ప్రతీ డైలాగ్ పేలిపోవాల్సందే. తెరపై ఎంతమంది కనపిస్తే… అంతమందీ పంచులే పంచాల్సిందే. రచయితగా, దర్శకుడిగా ఆయన శైలి అదే! నువ్వే నువ్వే నుంచి… సన్నాఫ్ సత్యమూర్తి వరకూ త్రివిక్రమ్ సినిమాల్లో పంచ్లదే అగ్ర తాంబూలం. అయితే ఈసారి మాత్రం పంచ్‌లు బాగా తగ్గించేశాడట త్రివిక్రమ్. తన కథనీ, క్యారెక్టర్లనీ పంచ్‌లు డామినేట్ చేస్తున్నాయనిపించిందో ఏమో… వాటిపై సరిగా దృష్టి పెట్టలేదట. అయితే మాత్రం సన్నివేశ పరంగా మాత్ర కావల్సినంత కామెడీ పుట్టించాడట.
త్రివిక్రమ్ తాజా చిత్రం.. అ.ఆ. ఇందులో పంచుల కంటే.. పాత్రలు, సన్నివేశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాడట త్రివిక్రమ్. చిన్న చిన్న పదాలతో మ్యాజిక్ చేయడం త్రివిక్రమ్ శైలి. అయితే.. ఈసారి తాను సృష్టించిన ట్రెండ్‌నే కాసేపు పక్కన పెట్టాడట. ఇందులో ఇంట్రవెల్ ముందు, సెకండాఫ్‌లో రెండూ భారీ లెంగ్త్ కామెడీ ఎపిసోడ్లు ఉంటాయట. అవి సినిమాకే హైలెట్ అని చిత్రబృందం చెబుతోంది. ఈసారి వెరైటీగా సమంత, నిత్యమేనన్లతోనూ బోల్డంత కామెడీ చేయించాడట. మరి పంచులు లేకుండా ఇలాంటి జోకులతో త్రివిక్రమ్ బండి లాగించగలడా, లేదంటే సరికొత్త ట్రెండ్ సృష్టిస్తాడా? తెలియాలంటే అఆ.. విడుదల కావాల్సిందే.