గబ్బర్‌సింగ్‌లో ఎర్ర తువాలు కట్టుకొని.. కనిపించాడు పవన్ కల్యాణ్. అప్పటి నుంచీ.. ఆ తువాలుకీ ఆయనకూ మధ్య అదోకరమైన రిలేషన్ ఏర్పడిపోయింది. సర్దార్ గబ్బర్‌సింగ్‌లో ప్రతీచోటా.. ఎర్ర తువాలు కట్టుకొనే దర్శనమిచ్చాడు పవన్. గబ్బర్ సింగ్ ప్రీమియర్ షోలకూ పవన్ అభిమానులు ఎర్ర తువాలు కట్టుకొని దర్శన మిచ్చారు. ఆ కండువాలకు.. భలే గిరాకీ ఏర్పడింది. ఇంతకీ ఈ ఎర్ర తువాలు అంటే.. పవన్‌కి ఎందుకంత మోజు? ఈ తువాలు వెనుక సీక్రెట్ ఏమిటి? ఈ విషయామే పవన్ దగ్గర కదిలిస్తే.. ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు.
చిన్నప్పుడు చిరంజీవి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండే రోజుల్లో.. ఇంటికి చుట్టాలెక్కువగా వచ్చేవారట. ఇంటికి వచ్చిన వారిని ఉత్తి చేతులతో పంపకూడదు కదా? అందుకే నూతన వస్త్రాలు పెట్టి సాగనంపాలి. అయితే.. అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఎర్ర తువాళ్లు తెచ్చి పెట్టేవారట. అలా ఇంట్లో ఎప్పుడు చూసినా అవే కనిపించేవట. అలా ఆ ఎర్ర తువాలుపై ఇష్టం, ప్రేమ కలిగాయని పవన్ చెబుతున్నాడు. అందుకే గబ్బర్ సింగ్లోనూ మెళ్లో వేసుకొని, నడుముకు చుట్టుకొని హల్ చల్ చేశాడు మన సర్దార్. అదీ.. ఎర్ర తువాలు సీక్రెస్.