పవర స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ గురించి ఎప్పుడూ ట్వీట్ చేస్తూ నానా రభస చేసే వర్మ ఇక నుండి పవర్ స్టార్ గురించి ట్వీట్ చేసేది లేదు అంటూ గుడ్ బై చెప్పేశాడు. పవర్ స్టార్ మీద తనకున్న అభిమానాన్ని ఎవరు అర్ధం చేసుకోవట్లేదని.. అయినా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తనకు ఇష్టమని ఇక నుండి పవర్ స్టార్ గురించి తాను ట్విట్టర్ లో ప్రస్థావించేది లేదు అన్నట్టు ట్వీట్ చేశాడు వర్మ. అంతే కాదు బై బై పీకే ఫ్యాన్స్ అని చెప్పేశాడు.
రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో వర్మ కామెంట్స్ కు పవర్ స్టార్ కూడా ఘాటుగా స్పందించడం పట్ల తానూ పవన్ ను ఎలా అనుకున్నానో అలానే ఉన్నారని.. ఇక తను మాత్రం పీకే గురించి ఎటువంటి ట్వీట్స్ చేయబోనని ఫైనల్ ట్వీట్ చేశారు. మరి సరదాగా అన్నాడో లేక నిజంగానే వర్మ ఆ నిర్ణయం తీసుకున్నాడో త్వరలో తెలుస్తుంది. సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో వర్మ బాహుబలితో పోలుస్తూ చేసిన కామెంట్స్ కాస్త ఫ్యాన్స్ ను హర్ట్ చేశాయి. ఇక ఇదే విషయం పట్ల పవన్ కూడా స్పందించడంతో తన మర్యాదను కాపాడుకునే విషయంలో తనకు తానుగా ఇక నుండి పీకే జోలికి వెళ్ళను అని ట్విట్టర్ ముఖంగా చెప్పేశాడు వర్మ. మరి ఇది అలానే కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.