ఈమధ్య కాలంలో వచ్చిన డీసెంట్స్ హిట్స్‌లలో ఊపిరి కూడా ఒకటి. క్లాస్ ప్రేక్షకుల్ల మనసుల్లో ఊపిరి మంచి స్థానాన్ని స్థానాన్ని సంపాదించుకొంది. రెండు భాషల్లో తీసిన సినిమా కాబట్టి… ఇటుతెలుగులోనూ, అటు తమిళంలోనూ బాగానే వర్కవుట్ అయ్యింది. ఈ సినిమా శాటిలైట్ బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరిగిందని. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాకి రూ.14 కోట్లకు కొనుక్కొన్నారని ప్రచారం జరిగింది. దాంతో పీవీపీ సంస్థ సేఫ్ జోన్‌లో పడిపోయిందనుకొన్నారు.
అయితే ఊపిరి సినిమా శాటిలైట్ ఇంకా పూర్తవ్వలేదని, ఫ్యాన్సీ రేట్లు వస్తున్నాయని, అయితే ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చిత్రబృందం ప్రకటించింది. శాటిలైట్ కోసం భారీ పోటీ ఏర్పడిందని, ప్రస్తుతం అవి చర్చల దశలో ఉన్నాయని తేల్చి చెప్పింది. వాస్తవానికి జెమిని, మా టీవీ సంస్థలు శాటిలైట్ కోసం క్యూలో ఉన్నాయి. నాగార్జునకైతే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ మా టీవీ దగ్గర ఉంచుకోవాలని ఉంది. నాగ్ రికమెండేషన్‌తో మా టీవీ ఈ శాటిలైట్ హక్కుల్ని ఫాన్సీ రేటుకు కొనుగోలు చేసే అవకాశం ఉందనేది తాజా సమాచారం.