కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దాదాపు అక్కడ రజినికి పోటీ ఇచ్చే స్టామినా ఉంది. అయితే అలాంటి క్రేజ్ ఉన్న హీరో ప్రతి సినిమా రిలీజ్ విషయంలో అవకతవకలు జరగడం ఇది కచ్చితంగా ప్రభుత్వ కుట్రే అని తెలుస్తుంది. ఒక సినిమా విషయంలో గొడవ జరిగింది అంటే సరే అనుకోవచ్చు కాని విజయ్ నటించిన ప్రతి సినిమా రిలీజ్ విషయంలో గొడవలు జరగడం ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు. పులి సినిమా టైంలో ఏకంగా హీరో, నిర్మాతల ఇళ్ల మీద ఐటి రైడ్ జరగడం ఆ సినిమా ఓరోజు పోస్ట్ పోన్ అవడం జరిగింది. అంతేకాదు ఇంతకుముందు విజయ్ సినిమాల రిలీజ్ విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
ఇప్పుడు తాజాగా విజయ్ నటించిన ‘తేరి’ సినిమా విషయంలో కూడా భారీ రేటుకి టికెట్స్ అమ్మవద్దు అంటూ గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేస్తే అలా అయితే సినిమా థియేటర్స్ లో ఆడించడం కష్టమని థియేటర్స్ యాజమాన్యులు సినిమాను ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. విజయ్ కు కోలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే త్వరలో తానో పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే ప్రతిసారి అమ్మ ప్రభుత్వం విజయ్ సినిమాను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుందని టాక్.
ఇక అక్కడ పరిస్థితి అలా ఉంటే తెలుగులో ఈ సినిమా పోలీసోడుగా రిలీజ్ అవుతుంది. టైటిల్ పోలీస్ వారిని అగౌరవ పరిచే విధంగా ఉందని.. పోలీసు అధికారుల సంఘం నుండి అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఈ క్రమంలో పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, నగర విభాగం అధ్యక్షుడు ఎన్. శంకర్ రెడ్డి సినిమా నిర్మాత దిల్ రాజుకు నోటీసులు కూడా పంపినట్టు తెలుస్తుంది. మరి ఇన్ని కష్టాల్లో పోలీసోడు ఎలా నెగ్గుకు వస్తాడు అన్నది చూడాలి.