నటుడు కోట శ్రీనివాసరావుకీ, దర్శకుడు కృష్ణవంశీకీ మధ్య విబేధాలొచ్చాయా? వస్తే ఎందుకొచ్చాయి? ఇద్దరూ మాటా మాటా ఎందుకు అనుకొన్నారు? అసలు ఇద్దరి మద్య ఏం జరిగింది? ఈ విషయంపై కోట శ్రీనివాసరావు మనసు విప్పారు. అసలు కృష్ణవంశీకీ తనకీ మధ్య ఏం జరిగిందో చెప్పుకొచ్చారు. ఓసారి ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ సహాయనటుడు అవార్డులు రెండూ ప్రకాష్‌రాజ్ కే దక్కాయట. ఆ సందర్భంలో కృష్ణవంశీ మాట్లాడుతూ ”తెలుగులో సరైన నటులే లేరు. దానికి నిదర్శనం ప్రకాష్‌రాజ్‌కి వచ్చిన అవార్డులు…” అని ఓ స్టేట్మెంట్ ఇచ్చారట. అది తెలిసిన కోట.. వెంటనే కృష్ణవంశీకి ఫోన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాడట.
”ముందు ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకో. తెలుగులో నటులు లేరు అనడం ఏంటి? అవార్డు వచ్చిన వాళ్లే గొప్ప నటులా? నాకో మంచి పాత్ర ఇచ్చి చూడు.. అప్పుడు తెలుస్తుంది.. నేనేంటో” అంటూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడట. అప్పటి నుంచీ వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని తెలుస్తోంది. అయితే… గోవిందుడు అందరివాడేలే సినిమాలో కోటకి ఓ వేషం ఇచ్చాడు కృష్ణవంశీ. ఆ సందర్భంలో మళ్లీ ఇద్దరూ… యధావిధిగా కలసిపోయారట. దర్శకుడు, నటుడు మధ్య ఇలాంటి చిన్న చిన్న మనస్ఫర్థలు రావడం కామన్. వాటిని దాటుకొని రావడం వాళ్ల చేతుల్లోనే ఉంది.