సెంచరీ సినిమాల హీరో శ్రీకాంత్. సాధారణంగా వివాద రహితుడు, అజాత శత్రువు. అందరికీ కావల్సినవాడు. అలాంటి శ్రీకాంత్ సినిమా చుట్టూ ఓ వివాదం నడుస్తోంది. శ్రీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం మెంటల్ పోలీస్. ఈ టైటిల్ మార్చండంటూ… పోలీస్ శాఖ శ్రీకాంత్‌కి నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై శ్రీకాంత్ కంగారు పడుతు్న్నాడట. ఆ విషయాన్ని తన మాటల్లోనే బయటపెట్టేశాడు శ్రీకాంత్. త్వరలోనే పోలీసుల్ని కలసి… ఈ టైటిల్ గురించి చర్చిస్తానని, వాళ్లు సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు.
”పోలీసులంటే నాకు గౌరవం. ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన, టెర్రర్ సినిమాల్లో మంచి పోలీసు పాత్రల్ని చేశా. వాళ్లనెప్పుడూ కించపర్చలేదు. కథానుసారమే.. ఈ సినిమాకి మెంటల్ పోలీస్ అనే పేరు పెట్టాం. వాళ్లు ఇబ్బంది పడితే సారీ. త్వరలోనే పోలీసుల్ని కలిసి… ఈ కథ గురించి వివరిస్తా” అంటున్నాడు. ఆల్రెడీ విజయ్ సినిమా పోలీసోడు టైటిల్ మారిపోయింది. ఈ సినిమా టైటిల్ కూడా మార్పించాలని తెలంగాణ పోలీసులు గట్టి పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. మరి శ్రీకాంత్ వాళ్లకి ఎలా సర్దిచెబుతాడో??