చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కథనీ, దర్శకుడ్నీ ఓకే చేయడానికి ఏళ్ల తరబడి టైమ్ తీసుకొన్న చిరంజీవి.. ఇప్పుడు ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి కూడా అంతే ఆలోచిస్తున్నారు. కత్తి స్ర్కిప్ట్ విషయంలో చిరు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారని, చిరు అంచనాలకు దగ్గరగా వినాయక్ ఆ కథని మలచలేకపోతున్నారని టాక్. స్ర్కిప్టు విషయంలో వినాయక్ – చిరులు తర్జన భర్జనలు పడుతూనే ఉన్నారు. అందుకే.. సినిమా సెట్స్‌పైకి వెళ్లడం ఆసల్యమవుతోంది. అయితే రామ్‌చరణ్ మాత్రం ఈ సినిమాకి ముహూర్తం కుదిరిపోయిందని అంటున్నాడు.
మేలో కత్తిలాంటోడు సినిమాని సెట్స్‌పైకి వెళ్తుందని ధృవీకరించాడు చరణ్. ముంబైలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో చరణ్ పాల్గొన్నాడు. అక్కడి మీడియా చిరంజీవి 150వ సినిమాకి సబంధించి చరణ్‌ని ప్రశ్నించింది. దాంతో.. చిరు సినిమా ముహూర్తం బయటపెట్టాల్సివచ్చింది. మే మొదటి వారంలో ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తారన్నాడు చరణ్. తండ్రి సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ తానే దగ్గరుండి చూసుకొంటాని చరణ్ చెబుతున్నాడు. 150వ సినిమాలో మీరు కూడా నటిస్తారా? అని అడిగితే ”దానికి ఇప్పుడే సమాధానం చెప్పలేను” అంటూ దాటవేశాడు. సో.. చిరు 150వ సినిమా అప్ డేట్స్ అవన్నమాట.