క్రమశిక్షణకు, తెలుగు సినీ పరిశ్రమకు మధ్య చాలా గ్యాప్ ఉంది. కొంతమంది తారలు షూటింగ్‌కి తమకిష్టమొచ్చినప్పుడు వెళ్తుంటారు. సెట్లో పేకాట ఆడేవాళ్లు కొందరైతే, ఏకంగా మందు బాటిల్ ఎత్తేసేవాళ్లు మరికొందరు. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుపై కూడా ఇలాంటి అభియోగాలున్నాయి. కోట మందుకొట్టి సెట్‌కి వెళ్తారని, అందుకే.. ఆయనకు ఈమధ్య అవకాశాలు తగ్గాయని అనుకొంటున్నారు. ఈ విషయమై ఇటీవల కోట స్పందించారు.
”మందుకొట్టి సెట్‌కి వెళ్తే ఇన్ని సినిమాలు చేసేవాడ్ని కాదు. అలాగని నేనేం మందు తాగను అనడం లేదు. అదీ లిమిట్‌లోనే. ఫుల్ స్వింగ్‌లో ఉన్నప్పుడు రోజుకి మూడు షిఫ్ట్‌లలో పనిచేయాల్సివచ్చేది. అర్థరాత్రి షూటింగ్ పెట్టేవారు.చలి తట్టుకోవడం కష్టమయ్యేది. ఆ సమయంలో చలిని భరించలేక రెండు పెగ్గులు తాగేవాడ్ని. అదీ దర్శకుడి అనుమతితోనే. రాత్రి ఇంటికి రెండు గంటలకు వెళ్లేవాడ్ని. అప్పటికి టీవీలు పెద్దగా ఉండేవి కావు. ఎంటర్టైన్మెంట్ దొరికేది కాదు. అందుకే.. మందుతో కాలక్షేపం చేయాల్సివచ్చింది. దానికి తాగుబోతు అని పేరు పెట్టేశారు..” అని ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా బయటపెట్టేశాడు కోట. ఇలా నిజాన్ని నిర్భయంగా చెప్పేవాళ్లు ఎంత మంది చెప్పండి..? ఈ విషయంలో కోటని మెచ్చుకొని తీరాల్సిందే.