అతి తక్కువ కాలంలోనే టీవీ యాంకర్ గా మంచిపేరు సంపాదించుకొన్న అందాల ముద్దుగుమ్మ అనసూయకి అనేక సినిమా ఆఫర్లు వస్తున్నప్పటికీ వాటిని ఆమె తిరస్కరిస్తున్నట్లు వింటున్నాము. కానీ కారణాలు ఏమిటో తెలియదు. బహుశః తను కోరుకొన్న పాత్రలు రాకపోవడం చేతనో లేక సినిమాల కోసం కుటుంబానికి దూరం కావడం ఇష్టం లేకనో లేకపోతే సినిమాలలో అందాల ప్రదర్శన చేయవలసివస్తుందనో ఏదో ఒక కారణం ఉండవచ్చును.
కానీ ఈ మధ్య కాలంలో ఆమె అనేక సినిమా ఆడియో విడుదల కార్యక్రమాలలో లేదా సినీ ప్రమోషన్ కార్యక్రమాలలోనొ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అంతే కాదు ఆమె ఈమధ్య స్టేజ్ మీద సినిమా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం మొదలు పెట్టారు. ఇటీవల దుబాయిలో ఆమె చేసిన డాన్స్ షో, అందులో ఆమె ప్రదర్శించిన సెక్సీ హావభావాలను, ఆమె వేసుకొన్న దుస్తులని చూసి ఆమెను అభిమానించే మహిళలు కూడా షాక్ అయ్యారు. ఇంతకంటే ఆమె సినిమాలలోనే ఏ అక్క పాత్రలో వదిన పాత్రలో చేసుకొంటే హుందాగా ఉండేది కదా మిగిలిన యాంకర్స్ లాగే అని అందరూ అనుకొంటున్నారు.