నందమూరి బాలకృష్ణ వందో సినిమా కోసం కథానాయిక వేట ఇంకా తెగలేదు. కథ రెడీ, దర్శకుడు రెడీ.. అయితే కథానాయిక విషయంలో తర్జన భర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలుత నయనతారని కథానాయికగా అనుకొన్నారు. బాలయ్య కోసం నయన కూడా జట్టు కట్టడానికి రెడీనే. కాకపోతే… నయన రెమ్యునరేషన్ గుర్తొచ్చి కాస్త ఆలోచనలో పడింది చిత్రబృందం. నయన రేటు మరీ రెండు కోట్లు దాటిపోవడంతో… ఆమెకు ప్రత్నామ్యాయంగా మరొకరిని ఎంచుకొంటే ఎలా ఉంటుందన్న ఆలోచనకొచ్చారు. ప్రత్యామ్నాయ జాబితాలో కాజల్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఇప్పుడు కాజల్‌ని సంప్రదిస్తే… `నాకు ఖాళీ లేదు సారీ..` అంటోందట.
సర్దార్ గబ్బర్‌సింగ్ డిజాస్టర్ మూటగట్టుకొన్న కాజల్.. ఇప్పుడు బ్రహ్మోత్సవంతో బిజీగా ఉంది. అది కాక.. ఓ 3 తమిళ సినిమాలు చేతిలో ఉన్నాయి. ఒకట్రెండు తెలుగు సినిమాలపై సంతకాలు చేసింది. అందుకే ఈ దశలో బాలయ్య సినిమాకు డేట్లు సర్దుబాటు చేయడం కుదరదని చెప్పేసిందట. బాలయ్య సినిమాకే ఖాళీ లేదని నిర్మాతలకు షాక్ ఇచ్చింది కాజల్. మరి.. ఇప్పుడు బాలయ్య కోసం ఎవరిని వెదుకుతారో?