జేడీ చక్రవర్తి… టాలీవుడ్లోవెరైటీ పర్సన్. ఏది అనిపిస్తే అది మాట్లాడేయడంలో, కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఇవ్వడంలో గురువు రాంగోపాల్ వర్మనే మించిపోయాడీ శిష్యుడు. నటుడిగా ఫ్లాప్ బాట పట్టినప్పుడే దర్శకత్వం వైపు అడుగులు వేశాడు. అక్కడా కలసి రాలేదు. ఇప్పుడు అటు నటన, ఇటు దర్శకత్వం రెండూ.. జేడీకి హ్యాండిచ్చేశాయి. దాంతో.. ఈ ముదురు బ్రహ్మచారి మనసు పెళ్లివైపు మళ్లింది. జెడీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడట. దిల్లీకి చెందిన అమ్మాయితో త్వరలో జేడీ పెళ్లి జరగబోతోందని టాక్.
నిజానికి జేడీకి పెళ్లంటే ముందు నుంచీ.. కాస్త వెటకారం. పెళ్లి మాట ఎప్పుడెత్తినా.. `మీడియా నాకు చాలా పెళ్లిళ్లు చేసింది.చాలామందితో సంబంధాలు అంటగట్టింది. ఇప్పుడు నాకు పెళ్లెందుకు` అనేవాడు. అయితే సడన్గా జేడీ మనసు మార్చుకోవడం వెనుక మతలబు ఏమిటో?? ఇంతకీ జేడీ వయసు ఎంతో తెలుసా?? 46 సంవత్సరాలు. మరి అమ్మాయికి ఎంతుందో మరి.