వైసీపీ నుంచి టీడీపీ లోకి వలసల పర్వం ఇంకా ముగియలేదు. వైసీపీ కి ఒక ఎంపీ సీట్ కూడా దక్కకుండా చేయడమే లక్ష్యంగా టీడీపీ ఇంకా పావులు కడుపుతూనే ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలకు ఎరలు వేస్తూనే ఉంది. అయితే తాజా సంగతి ఏమిటి అంటే.. సోమవారం మొదలైన అప్ కేబినెట్ సమావేశం సందర్భంగా కూడా ఎక్కువగా వలసల చర్చ జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఏ మంత్రులు ఎందరు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ లోకి తీసుకు వచ్చారు అనేది వారి పని తీరుకు గీటురాయి అయినట్లుగా నాయకులూ మాట్లాడు కోవడం విశేషం.
చిత్తూరు, ప్రకాశం, విజయనగరం, కర్నూలు జిల్లాల నుంచి ఇంకా ఎమ్మెల్యేల వలసలు మిగిలి ఉన్నాయని చాల కాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో త్వరలోనే ఎమ్మెల్యేల వలసల పర్వానికి ఫుల్ స్టాప్ పెట్టేలాగా, త్వరిత గతిన ముగించాలని అధికార పార్టీ భవిస్తున్నట్లుగా తెలుస్తోంది.
నామినేటెడ్ పదవుల పందేరం చేయాల్సి ఉన్నదని, ఒకసారి అది కూడా పూర్తయిపోతే ఇక వలసలకు కష్టం అయిపోతుందని, అందువల్ల వీలైనంత వేగంగా మహానాడు లోగా వలసల పర్వాన్ని ముగించాలని చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు చెబుతున్నట్లు సమాచారం.
మొత్తానికి ఎమ్మెల్యే ల వలసలను చంద్రబాబు సర్కారు ఈ కేబినెట్ భేటీ తరవాత టాప్ గేర్ లోకి తీసుకు వెళ్ళవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే, మందిని కాపాడుకోవడానికి జగన్ కు కొత్త వ్యూహాలు అవసరం కావచ్చు.