రచయిత దర్శకుడైతే ఎన్ని సౌలభ్యాలుంటాయో.. అంతకంటే ఎక్కువ ప్రమాదాలుంటాయి. రాసిన ప్రతీ సన్నివేశంపైనా మమకారం పెంచుకొంటాడు. ఎంత లెంగ్తీ సన్నివేశమైనా సరే… తీసి పారేస్తుంటాడు. తీరా చూస్తే.. మూడు గంటల సినిమా తేలుతుంది. మళ్లీ దాన్ని ట్రిమ్ చేయడానికి కూడా మనసొప్పదు. త్రివిక్రమ్‌కి ఇప్పడు అలాంటి ఇబ్బందే ఎదురవుతోంది. స్ర్కిప్టు తానొక్కడే కూర్చుని రాసుకోవడం త్రివిక్రమ్‌కి అలవాటు. దాంతో..సెకండ్ ఒపీనియన్ లేకపోవడంతో ఒక్కోసారి జడ్జిమెంట్ తప్పుతుంది. సీన్ తీశాక ఓసారి చూసుకొంటే.. ఇది నా కథకి యాప్ట్కాదేమో అనిపిస్తుంటుంది. అ… ఆ విషయంలోనూ అదే జరుగుతోందట.
నితిన్ – సమంత జంటగా నటిస్తున్న చిత్రం అ.ఆ. ఈ సినిమా ఇప్పటికే పూర్తి కావాల్సింది. అయితే ఇంకా షూటింగ్ దశలోనే ఉండిపోయింది. దానికి కారణం.. త్రివిక్రమే అని తెలుస్తోంది. ఓ సీన్ తీసేసి.. దాన్ని ఎడిట్ చేసి లాప్టాప్లో చూసుకొంటే తప్ప – అది సినిమాకి పనికొస్తుందో లేదో కూడా తెలియడం లేదట. అలాంటి సీన్లు మళ్లీ తిరగరాసి.. రీషూట్లు చేస్తున్నాడట త్రివిక్రమ్. దాంతో తీసిన సీనే.. మళ్లీ తీయాల్సిన పరిస్థితి వస్తోందట. బెటర్మెంట్ కోసం ఓసారి, రాసింది నచ్చక మరోసారి.. ఇలా తీసిందే మళ్లీ మళ్లీ తీయడం వల్లే.. ఈ సినిమా ఆలస్యం అవుతోందట. సినిమా లేట్ అయినా ఫర్వాలేదు.. హిట్ సినిమా ఇస్తే చాలు అంటున్నాడట నిర్మాత. అలాంటి నిర్మాత ఉంటే ఇంకేముంది? త్రివిక్రమ్ అలా తీస్తూనే ఉంటాడు మరి.