అందం, చందం.. తెలుగు సినిమా కమర్షియల్ హీరోయిన్‌కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి తాప్సిలో. నటించదా… అంటే ఆ అవకాశం ఇవ్వాలేగానీ.. ఇరగదీస్తుంది. కానీ… తాప్సికి అవకాశాలు మాత్రం దక్కడం లేదు. అసలు తాప్సీ పేరే ఎవ్వరూ పరిగణలోనికి తీసుకోవడం లేదు. అడపా దడపా తమిళంలో అలా మెరుస్తోంది గానీ… తెలుగులో తాప్పిని పట్టించుకొన్న నాధుడే లేడు. దాంతో.. పాపం తాప్సి తెగ ఫీలైపోతోంది. ‘నాకు తెలుగు చిత్రసీమ అంటే చాలా ఇష్టం. తెలుగుని నా మాతృభాషలా ప్రేమించా. కానీ.. అక్కడి నుంచే అవకాశాలు రాకపోవడం చాలా బాధేస్తోంది’ అంటోంది.
”కథానాయికగా నేను ఏం చేయాలో అన్నీ చేశా. కానీ.. ఎందుకనో నన్నెవరూ గుర్తించలేదు. నా అదృష్టవశాత్తూ కథానాయిక అయ్యా. తొలుత అవకాశాలు అలానే వచ్చాయి. కానీ అదే అదృష్టం ఇప్పుడు నా వెంట లేదనిపిస్తోంది. అందుకే.. నేనెవరి దృష్టిలో పడడం లేదు. ఇప్పటికీ ఓ అవకాశం ఇస్తే నేనేంటో చూపిస్తా. అవకాశాలు రావడం లేదని బాధేం లేదు.. నా వ్యక్తిగత జీవితం నాకుంది. దాన్ని హ్యాపీగానే గడుపుతున్నా” అని తనకు తాను ధైర్యం తెచ్చుకొంది తాప్పి. మరి ఈ పంజాబీ పడుచు ఆవేదనని ఏ దర్శకుడైనా అర్థం చేసుకొంటే బాగుణ్ణు.