2019 ఎన్నికల్లో పూర్తిస్థాయి పార్టీగా జనసేనని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని పవన్ కల్యాణ్ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఏ పార్టీతో పొత్తు పెట్టుకొన్నా, లేకున్నా – ఎన్నికల బరిలో దిగడం మాత్రం ఖాయం. ఎన్నికలంటే మాటలు కాదు. బోల్డంత ప్రచారం చేసుకోవాలి. తనని నిత్యం మోసే ఓ పత్రికగానీ, ఛానెల్గానీ కావాలి. అందుకోసం పవన్ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలెట్టేసినట్టు టాక్. తన తరపున వకాల్తా పుచ్చుకొనే మీడియా సంస్థ ఉంటే.. తనకు ఎన్నికల్లో పబ్లిసిటీ పరంగా చూసుకోవాల్సిన అవసరం లేదని పవన్ భావిస్తున్నాడు.
అయితే ఓ ఛానల్ స్థాపించడానికి.. చాలా పెట్టుబడి కావాలి. పత్రిక పెట్టడం అంటే ఇప్పట్లో తెవిలే వ్యవహారం కాదు. అందుకే నష్టాల్లో ఉన్న ఓ ఛానెల్‌ని కొనేసి… దానికి మరమత్తులు చేయాలని భావిస్తున్నాడట. అంతకంటే ముందే ఓ యూ ట్యూబ్ ఛానల్‌ని క్రియేట్ చేయాలని పవన్ ఆలోచిస్తున్నాడు. టీవీ ఛానల్ అంటే కోట్లతో ముడిపడిన వ్యవహారం. అదే యూ ట్యూబ్ అయితే.. సింపుల్ గా తెవిలిపోతుంది. అందుకే ముందు యూ ట్యూబ్ ఛానల్ లాంచ్ చేసి, దానికొచ్చిన రెస్పాన్స్ చూసి, అప్పుడు టీవీ ఛానల్ పెడతాడట. మొత్తానికి పవన్ ఇప్పుడిప్పుడే రాజకీయ నాయకుడిగా ఆలోచించడం మొదలెట్టాడు… మున్ముందు పవన్‌లోని రాజకీయ నాయకుడ్ని పూర్తి స్థాయిలో చూస్తామనడంలో ఎలాంటి సందేహాలూ అక్కర్లేదు.