మెగా హీరో సాయిధరమ్‌తేజ్ మాంఛి కాక మీదున్నాడు. పిల్లానువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్.. హిట్ బాట పట్టడంతో సాయి మార్కెట్ వాల్యూ బాగా పెరిగిపోతోంది. తాజాగా సుప్రీమ్పై కూడా మంచి అంచనాలున్నాయి. దిల్‌రాజు బ్యానర్ సినిమాకావడం, పటాస్ దర్శకుడు అనిల్ రావిపూడి యాడ్ అవ్వడంతో ఈ సినిమా బిజినెస్ ఓ రేంజులో జరిగిందట. ఆడియో రిలీజ్‌కి ముందే ఈ సినిమాని టేబుల్ ప్రాఫిట్‌కి అమ్ముకొన్నాడు దిల్‌రాజు.
సుప్రీమ్ బడ్జెట్ రూ.17 కోట్ల వరకూ అయ్యిందని టాక్. ఈ సినిమాని అన్ని ఏరియాల్లో కలుపుకొని రూ.25 కోట్లకు అమ్మేశాడట దిల్ రాజు. శాటిలైట్‌కి కనీసం రూ.3 కోట్లయినా వస్తాయి. అంటే.. దాదాపు 11 కోట్లు లాభమన్నమాట. మెగా హీరోని నమ్ముకొని రిలీజ్‌కి ముందే రూ.11 కోట్లు కొట్టేశాడు దిల్‌రాజు. ఆయన సుడే సుడి మరి. షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్‌లో ఉన్న సుప్రీమ్ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.