దుష్ట పాకిస్తాన్ ఎంత రాక్షసంగా వ్యవహరిస్తుందో మరోసారి రుజువైంది. గూఢచర్యం అభియోగంపై పాక్ జైల్లో శిక్ష పొందుతూ క్రిపాల్ సింగ్ అనే భారతీయుడు వారం క్రితం అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. అతడు గుండెపోటుతో మరణించాడని పాక్ ప్రభుత్వం బుకాయించింది. అది నిజం కాదని, జైల్లో చిత్రహింసలు పెట్టడం వల్లే అతడు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోపించారు. కోట్లాది మంది భారతీయులు కూడా అదే అనుమానం వ్యక్తం చేశారు. అయినా పాపిష్టి పాకిస్తాన్ మాత్రం నిజాన్ని ఒప్పుకోలేదు. చివరకు లాహోర్ లోని ఆస్పత్రిలో పోస్టుమార్టం అయిందనిపించారు. మంగళవారం మధ్యాహ్నం వాగా సరిహద్దుల్లో క్రిపాల్ భౌతిక కాయాన్ని భారత్ అధికారులకు అప్పగించారు.
క్రిపాల్ సింగ్ మృతదేహానికి అమృత్ సర్ వద్ద పోస్టు మార్టం చేసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అతడి శరీరంలో గుండె లేదు. కాలేయం లేదు. పొట్ట భాగం లేదు. గుండె పోటుతో చనిపోయినా గుండె ఏమవుతుంది? జైల్లో హింసించిన ఆనవాళ్లు ఉండటం వల్లే ఆ శరీర భాగాలను తొలగించి ఉంటారని క్రిపాల్ కుటుంబీకులు, ప్రజలు భావిస్తున్నారు. పాకిస్తానీలు ఎంత పైశాచికంగా ప్రవర్తిస్తారో చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ. ఇంతకు సరబ్ జిత్ సింగ్ ను కూడా ఇలాగే పాక్ జైల్లో తీవ్రంగా కొట్టి చంపారు. అతడిని కూడా గూడచారి అనే అభియోగంతో జైల్లో బంధించారు.
పాకిస్తాన్ ఎలాంటి దేశమో తెలిసి కూడా మన దేశంలో ప్రభుత్వాలు వాస్తవానికి భిన్నంగా వ్యవహరిస్తుంటాయి. యూపీఏ హయాంలో ముంబై దాడి జరిగింది. సజీవంగా పట్టుబడ్డ నరరూప రాక్షసుడు అజ్మల్ కసబ్ ను అల్లుడిగా చూసుకున్నారు. ప్రత్యేకంగా బాంబు ప్రూఫ్ సెల్ ఏర్పాటు చేసి, అందులో సెంట్రల్ ఏసీ అమర్చి బిర్యానీలుపెట్టి మేపారు. అందుకోసం కోట్లు ఖర్చు పెట్టారు. పార్లమెంటుపై దాడి కేసులో మరణ శిక్ష పడిన పడిన అఫ్జల్ గురును ఉరితీస్తే దేశంలోని ముస్లింలకు కోపం వస్తుందేమో అని సోనియా గాంధీ బృందం మల్లగుల్లాలు పడింది. ఏళ్లకేళ్లు నాన్చింది. చివరకు విమర్ళలు తీవ్రం కావడంతో ఉరిశిక్ష అమలైంది.
పాక్ జైళ్లలో భారతీయ ఖైదీలను పురుగుల్లా చూస్తారనేది బహిరంగ రహస్యమే. అలాంటి దేశంతో అదే విధంగా వ్యవహరించాలి. ఒక్క దెబ్బకు పది దెబ్బలతో జవాబు చెప్పేలా ఉంటేనే రాక్షసులకు అర్థమవుతుంది. ఈ విషయం కనీసం మోడీ సర్కారుకైనా అర్థమవుతుందా?