సాధారణంగా అగ్ర కథానాయకుడి సినిమా అంటే బెనిఫిట్ షోలు హోరెత్తాల్సిందే. అర్థరాత్రి ఆట చూసేయాలని ఫ్యాన్స్ ఉత్సాహపడుతుంటారు. సర్దార్ గబ్బర్సింగ్కి ఓ రేంజులో బెనిఫిట్ షోలు వేశారు. రాత్రి ఒంటగంటన్నరకు తొలి ఆట పడిపోయింది. సరైనోడుకీ సేమ్ సీన్ రిపీట్ అవుతుందని మెగాఫ్యాన్స్ భావించారు. అయితే.. సీన్ రివర్స్ అయ్యింది. అర్థరాత్రి 1.30 ఆట కాదుకదా, ఆరింటికి షో కూడా పర్మిషన్లు దొరకలేదు. అయితే.. గీతా ఆర్ట్స్ కూడా పర్మిషన్ల కోసం పెద్దగా ప్రయత్నించిందీ లేదని టాక్. దానికి అల్లు అరవింద్ మార్క్.. స్కెచ్ ఉంది.
అర్థరాత్రి షోల వల్ల.. సినిమాకు పెద్దగా ఉపయోగం లేదన్నది అరవింద్ మాట. ఫ్యాన్స్ కచ్చితంగా సినిమా చూస్తారు… కాకపోతే కాస్త లేట్ అవుతుంది అంతే. ఒకవేళ సినిమా అటూ ఇటూ అయితే బ్యాడ్ టాక్ వస్తే, తెల్లారేసరికి సినిమా చప్పున చల్లారి పోతుంది. పైగా యాంటీ ఫ్యాన్స్ సినిమా చూసి బ్యాడ్ టాక్ని ట్విట్టర్లలో, ఫేస్బుక్లలోనూ పోస్ట్ చేసే ప్రమాదం ఉంది. అందుకే.. బెనిఫిట్ షోలు వద్దు అనుకొన్నాడట అల్లు అరవింద్. దాంతో.. అర్థరాత్రి షోలను పూర్తిగా పక్కన పెట్టేశారు.