సరైనోడు సినిమా రీషూట్లు, రీసెన్సార్లూ జరుపుకొంది. తొలుత ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు, రీషూట్ తరవాత యు బై ఏ గా మార్చింది. చిరంజీవి ఈసినిమాని చూశారని, ఆయన సలహాల ప్రకారమే సినిమాలోని కొన్ని సన్నివేశాల్ని రీషూట్ చేయాల్సివచ్చిందని బయట గుసగుసలు వినిపించాయి. వీటిపై బోయపాటి శ్రీను స్పందించారు.
”సరైనోడు కోసం రీషూట్లు జరిపిన మాట వాస్తవమే. అయితే అది సెన్సార్ కోసమే. ద్వితీయార్థంలో రెండు సన్నివేశాల పట్ల సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది. అవి తీసేస్తే… యుబై ఏ సర్టిఫికెట్ ఇస్తామన్నారు. అయితే ఆ సన్నివేశాలే సినిమాకి బలం. అవి లేకపోతే కథ పండదు. దాంతో ఆ సన్నివేశాల్ని మళ్లీ రీషూట్ చేసి చూపించాం. రెండోసారి తీసినప్పుడు ఆ యాక్షన్ మోతాదు కాస్త తగ్గించాం. అందుకోసమే రీషూట్కి వెళ్లాం. అంతకు మించిన కారణాలు లేవు” అని చెప్పుకొచ్చారు బోయపాటి శ్రీను. ఆయన సినిమాల్లో హింస ఓ లెవిల్లో ఉంటుందన్నది వాస్తవమే. సెన్సార్ వాళ్లే భయపడిపోయారంటే.. సరైనోడులో ఏ రేంజులో చూపించారో అర్థం చేసుకోవొచ్చు.