తెలుగు జెమినీ టీవీ ఛానల్లో జూన్1వ తేదీ నుండి ప్రారంభమయిన “అత్తో అత్తమ్మ కూతురో” తెలుగు సీరియల్లో రంగనాథ్, నిరోష, జాకి,మహర్షి తదితరులు నటిస్తున్నారు. అది ప్రారంభమయ్యి గట్టిగా రెండు నెలలు కూడా తిరక్కుండానే వివాదాలలో చిక్కుకొంది. ఆ సీరియల్లో ప్రసారం చేస్తున్న ఒక పాటని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి పట్నాయిక్ త్వరలో విదుల కాబోతున్న తులసిదళం సినిమా కోసం సిద్దం చేసారు. కానీ ఆయన అనుమతి లేకుండానే, ఆయనకీ తెలియజేయకుండానే ఆ పూర్తి పాటని ‘అత్తో అత్తమ్మ కూతురో’ సీరియల్లో ప్రసారం చేసేసారు ఆ సీరియల్ నిర్మాతలు. దానితో తీవ్ర ఆగ్రహం చెందిన ఆర్.పి పట్నాయిక్ ఆ సీరియల్ నిర్మాతలపై రూ. 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ నోటీసులు పంపినట్లు తాజా సమాచారం. వారి స్పందన బట్టి ఆయన త్వరలోనే కోర్టులో కేసు వేసే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. ఇంతవరకు సినిమా టైటిల్స్ ని, పాటలలో లిరిక్స్ ని టీవీ సీరియల్స్ నిర్మాతలు యదేచ్చగా వాడుకొంటున్నారు. ఇకపై సినిమా పాటలను, సినిమా పేర్లను టీవీ సీరియల్స్ నిర్మాతలు వాడుకోకుండా నిబంధనలు ఏర్పాటు చేయాలని ఆర్.పి పట్నాయిక్ నిర్మాతలు, దర్శకుల సంఘాలని కోరినట్లు తెలుస్తోంది.