నందమూరి బాలకృష్ణ నూరవ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి శుక్రవారం ముహుర్త కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అటెండ్ అయ్యి చిత్రయూనిట్ కు బాలకృష్ణకు తన శుభాకాంక్షలు తెలపారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లు రాగా దర్శకులు కె.రాఘవేంద్ర రావు, సింగీతం శ్రీనివాసర రావు, కోదండ రామిరెడ్డి తదితరులు వచ్చారు. అయితే ఇంత గ్రాండ్ గా జరిగిన ఈవెంట్ కు నందమూరి వారసులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాం రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
వారి మధ్య ఎన్ని అభిప్రాయ బేధాలున్నా ప్రత్యక్షంగా బయట పడని వారు ఈ వేడుకకు రాకపోవడం అభిమానులను కాస్త ఆలోచనలో పడేసింది. ఒకవేళ బాలయ్య వారికి ఆహ్వానం పంపలేదా లేక ఇన్వైట్ చేసినా వారు రాలేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక తన వారసుడు మోక్షజ్ఞను ఈ సినిమాతో ఎంట్రీ ఇప్పించే ఆలోచనలో ఉన్న బాలకృష్ణ ఈ ముహుర్తపు కార్యక్రమానికి మోక్షజ్ఞను తీసుకురాకపోవడం కూడా ఎదో మతలబు ఉందని అంటున్నారు. మరి బాబా కోసం అబ్బాయ్ లు కావాలనే రాలేదా లేక ఇన్విటేషన్ అందలేదని అలిగారా అన్నది త్వరలో తెలుస్తుంది.