కొత్త తరహా పాత్రలు వచ్చినప్పుడు తనని తారు నిరూపించుకోవడానికి సదా సిద్ధంగాఉంటాడు.. అల్లు అర్జున్. రుద్రమదేవిలో గోనగన్నారెడ్డిగా కనిపించింది అందుకే. ఆ సినిమా ఎవరికి ఎంత లాభం తెచ్చిపెట్టిందో తెలీదుగానీ, బన్నీ కెరీర్‌కి మాత్రం బాగా హెల్ప్ అయ్యింది. నటుడిగా నిరూపించుకొనే మరో అవకాశం ఆ పాత్రే కల్పించింది. మున్ముందూ ఆ తరహా పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నానంటున్నాడు బన్నీ.
తాజాగా సరైనోడులో ఆది పినిశెట్టి పోషించిన వైరం ధనుష్ పాత్రపై బన్నీ మక్కువ పెంచుకొన్నాడట. బన్నీ ఈ సినిమాలో గణగా కనిపించాడు. ఆ తరవాత ఎక్కువ మార్కులు వైరం ధనుష్ పాత్రకే దక్కాయి. వైరం ధనుష్ తరహా పాత్ర చేయాలని వుందని బన్నీ తన మనసులో మాట బయటపెట్టాడట. ఒకవేళ ‘సరైనోడు’ సినిమాని మరో భాషలో రీమేక్ చేస్తే.. ఆది పోషించిన పాత్రలో నేను కనిపిస్తా.. అంటున్నాడు బన్నీ. అయితే సరైనోడు కథని మరో భాషలో రీమేక్ చేసే దమ్ము ఎవరికి ఉంది. సో.. బన్నీది తీరని కోరికే అన్నమాట.