ఎప్పుడు లేనిది ఈ సంవత్సరం సమ్మర్ లో స్టార్ హీరోల సినిమాలు వస్తుంటే సిని అభిమానులంతా ఈ హాలీడేస్ ను మరింత ఎంజాయ్ చేద్దామనుకున్నారు. ఇక రిలీజ్ అవుతున్న సినిమాల మీద మంచి ఉత్సాహం చూపిస్తున్నారు. కాని సినిమాల ఫలితాలు మాత్రం వారిని నిరుత్సాహా పరుస్తున్నాయి. ఏప్రిల్ 8న సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ నానా హడావిడి చేసి రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సినిమా ఏదో ఆయన కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కు ఈ మాత్రం కలక్షన్స్ అయినా వస్తున్నాయి కాని సగటు సిని ప్రేక్షకుడు మాత్రం సినిమా చూసి పెదవి విరిచారు.
ఇక సర్దార్ ఎలాగు అంచనాలు అందుకోలేకపోయాడు ఇక సరైనోడు అయినా దాన్ని బీట్ చేస్తాడేమో అనుకుంటే డోస్ ఎక్కువై అసలుకే మోసం వచ్చే పరిస్థితి కనబడుతుంది. మాస్ ఊర మాస్ అంటూ మొదట నుండి సినిమాలో ఉన్న విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నా.. థియేటర్స్ లో అతి హింసను తట్టుకోలేకపోయారు ప్రేక్షకులు. బోయపాటి రెగ్యులర్ కథల మాదిరి కథలను కలిపి తీసిన సరైనోడులో అల్లు అర్జున్ యాక్టింగ్ తప్ప ఏది వర్క్ అవుట్ అవలేదు. ఫలితం సినిమా అన్ని చోట్ల ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
ఇక ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాలు ఇలా చల్లబడితే మే నెలలో రాబోతున్న బ్రహ్మోత్సవం ఏ విధంగా ఉంటుందో అని అభిమానుల్లో కాస్త టెన్షన్ మొదలైంది. అయితే సర్దార్ లా సొంత ప్రయోగాలు.. సరైనోడులా ఊర మాస్ కథాంశాలతో కాకుండా చక్కగా ఫ్యామిలీ మొత్తం చూసే సినిమాగా బ్రహ్మోత్సవం రాబోతుంది. మహేష్ కోసం ఎంతోమంది దర్శకులు క్యూలో నిలబడుతుంటే కేవలం మూడు సినిమాల అనుభవమున్న శ్రీకాంత్ అడ్డాలకు ఛాన్స్ ఇచ్చాడంటే అర్ధం చేసుకోవచ్చు. మరి మహేష్ బ్రహ్మోత్సమైనా సరే సిని అభిమానుల దాహం తీస్తుందా లేదా అన్నది చూడాలి.