తాజా సమాచారం ప్రకారం హీరో ప్రభాస్ భీమవరానికి చెందిన ఒక ప్రియ అనే యువతిని వివాహం చేసుకోబోతున్నారు. ఆమె ప్రస్తుతం ఇంజనీరింగ్ ఫైనల్ చదువుతోంది. ఇదివరకే పెళ్లి చూపుల కార్యక్రమం జరిగినట్లు సమాచారం. మళ్ళీ ఈ ఏడాది సెప్టెంబర్ నుండి ప్రభాస్ బాహుబలి సినిమా రెండవ భాగం షూటింగ్ కి హాజరు కావలసి ఉంటుంది కనుక ఆలోగానే వారి నిశ్చితార్ధం వచ్చే ఏడాది మార్చిలోగా వివాహం జరుగవచ్చని తెలుస్తోంది. బాహుబలి సినిమా రిలీజ్ తరువాత ప్రభాస్ పెళ్లి చేసేస్తామని కృష్ణం రాజు చాలా కాలం క్రితమే ప్రకటించారు. కానీ ఇప్పుడు పెళ్లి కూతురు ఆమేనా కాదా అనే సంగతిని దృవీకరించవలసి ఉంది.