కథానాయకుల పారితోషికం ఆకాశాన్ని తాకుతోంది. కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ అందుకొంటున్నారు హీరోలు. సొంత సంస్థ లో చేస్తున్న సినిమా అయినా సరే.. ఏమాతగ్గడం లేదు. కుడి చేత్తో ఇచ్చి, ఎడం చేత్తో తీసుకొనే వ్యవహారం కాబట్టి పారితోషికం ఎంతిచ్చినా ఓకే.. అనుకొన్నాడేమో ఇప్పుడు గీతా ఆర్ట్స్ నుంచి బన్నీ భారీ పారితోషికం అందుకొన్నాడు. సరైనోడు గీతా ఆర్ట్స్‌లో తెరకెక్కిన సంగతి తెలిసిందే. సొంత సంస్థే కదా.. అని బన్నీకి పారితోషికం ఇవ్వకుండా ఉండరు కదా? బన్నీ అకౌంట్‌లో ఏకంగా రూ.12 కోట్లు పడ్డాయట.
సరైనోడు సినిమాకి రూ.52 కోట్ల బడ్జెట్ తేల్చింది చిత్రబృందం. అందులో బన్నీ వాటానే రూ.12 కోట్లన్నమాట. ఏ విషయంలోనైనా పక్కాగా వ్యవహరించడంలో అల్లు అరవింద్ సుప్రసిద్దుడు. ఆయన దగ్గర లెక్కాపత్రాలన్నీ పక్కాగా ఉంటాయి. బన్నీ పారితోషికం కింద బడ్జెట్‌లో రూ.12 కోట్లు రాశారు. అంటే బన్నీ పారితోషికం ఇక నుంచి రూ.12 కోట్లన్నమాట. ఈ సినిమాతో బన్నీని టాప్ హీరోల సరసన మరో మెట్టు ఎక్కించాలని ప్రయత్నం చేశారు అరవింద్. అందుకే… భారీ ఎత్తున ఖర్చు పెట్టారు. పారితోషికం పెంచుకొన్నారు. కొడుకు సినిమాని ఆమాత్రం ప్రమోట్ చేసుకోకపోతే ఎలా?