దిల్‌రాజు సినిమా అంటే అన్నీ పక్కా ప్లానింగ్‌తో జరిగిపోతాయి. ప్రమోషన్ల విషయంలో చాలా కేర్‌గా ఉంటారాయన. ప్రమోషన్లతోనే సినిమాని హైప్ తీసుకొస్తారు. అయితే ఈమధ్య ఆయన బ్యానర్ నుంచి వచ్చిన పోలీసోడు (ఈ టైటిల్‌ని ఆ తరవాత పోలీస్‌గా మార్చారు) సినిమా పబ్లిసిటీ కరువుతోనే ఫ్లాప్ అయ్యిందని తమిళ వాసులు గుస్సా పెంచుకొన్నారట. తమిళంలో విజయ్ చిత్రం భారీ వసూళ్లను రాబట్టుకొంది. తెలుగులో అయితే.. అసలు ఓపెనింగ్సే రాలేదు. పోలీస్ అంటూ టైటిల్ మార్చిన పోస్టర్లు కూడా బయట కనిపించలేదు. ప్రెస్ మీట్లూ, ఇంటర్వ్యూలు అంటూ తన సినిమా విడుదలకు ముందు హడావుడి చేసే దిల్‌రాజు ఈ సినిమా విషయానికి వచ్చేసరికి చేతులెత్తేశాడు.
దాంతో తమిళ నిర్మాత కలైపులిథాను.. దిల్‌రాజుపై కోపంగా ఉన్నాడట. కేవలం దిల్‌రాజుపై ఉన్న నమ్మకంతో ఈ సినిమాని తక్కువ రేటుకి అమ్మేశాడు. దిల్‌రాజేమో ప్రమోషన్లు గాలికి వదిలేశాడని థాను ఫీలవుతున్నాడట. రజనీకాంత్‌తో తెరకెక్కిస్తున్న కబాలీకి థానూనే నిర్మాత. ఆ సినిమా తెలుగు హక్కులు దిల్‌రాజుకి ఇవ్వాలని ఆయన భావించార్ట. పోలీసోడు రిజల్ట్ చూసి.. ఆయన మనసు మార్చుకొన్నార్ట. విజయ్ సినిమా ఫ్లాపవ్వడంతో… ఆ ఎఫెక్ట్ రజనీకాంత్ సినిమాపై పడిందన్నమాట. పాపం.. దిల్‌రాజు.