డిక్టేటర్ తరవాత వేదాశ్వ బ్యానర్‌పై మరో సినిమా చేయాలని దర్శకుడు శ్రీవాస్ తన ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. నాగచైతన్య కోసం ఓ కథ సిద్ధం చేసి.. వినిపించాడు కూడా. నాగార్జున ఈ కథ విని పచ్చజెండా ఊపారు. నాగచైతన్య – శ్రీవాస్ కాంబినేషన్లో ఈ మూవీ దాదాపుగా సెట్ అయిపోతుందని కూడా అనుకొన్నారు. అయితే.. ఆఖరి క్షణాల్లో నాగచైతన్య నో అనడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు అదే కథతో గోపీచంద్ దగ్గర వాలాడు శ్రీవాస్. ఆల్రెడీ లక్ష్యం, లౌక్యం వంటి హిట్లు ఇచ్చాడన్న ధైర్యంతో గోపీచంద్ ఈ కథకు ఓకే చెప్పాడు. అయితే.. నాగచైతన్య కోసం రాసుకొన్న కథ గోపీచంద్ ఇమేజ్‌కీ బాడీలాంగ్వేజ్కీ ఎలా సెట్టవుతుందన్న అనుమానాలు నెలకొన్నాయి.
శ్రీవాస్ తన కథల్లో కామెడీ, యాక్షన్ ఈ రెండింటినీ సరైన మోతాదుల్లో జోడిస్తాడు. అయితే కామెడీ టైమింగ్ విషయంలో చైతూ కాస్త వీక్. అందుకే ఈ సినిమాని నాగచైతన్య పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. సౌఖ్యం ఫ్లాప్ తో ఆల్రెడీ డీలాలో పడిపోయాడు గోపీచంద్. ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ని నమ్ముకొని కనీసం యావరేజ్ కొట్టినా చాలు అన్నట్టుగా ఉంది గోపీచంద్ పరిస్థితి. శ్రీవాస్ కనుక కలిస్తే.. తన కాంబినేషన్‌కి ప్రాధాన్యం పెరుగుతుందని భావించిన గోపీచంద్ నాగచైతన్య నో చెప్పిన కథకు ఓకే చేశాడని తెలుస్తోంది.