కొత్త కథల్ని, కొత్త దర్శకుల్ని ఎంచుకొంటూ.. ఏదోలా కొత్తదనం చూపించాలని పరితపిస్తుంటాడు నారా రోహిత్. బాణం నుంచీ… ‘కొత్త’ కోసం పరితపిస్తున్నా.. సరైన బ్రేక్ మాత్రం రాలేదు మనోడికి. సోలో యావరేజ్ అనిపించుకొంది. ప్రతినిధి సినిమాకి మంచి టాక్ వచ్చినా డబ్బులు రాలేదు. తుంటరి, సావిత్రి ఫ్లాప్స్‌గా మిగిలాయి. రేపు (శుక్రవారం) రాజా చేయి వేస్తే విడుదల కాబోతోంది. ఈ సినిమా అయినా హిట్టిస్తే… రోహిత్ కెరీర్‌కి ఊపు రావొచ్చు. విజయాలు లేనప్పుడే చేతిలో అరడజను సినిమాలు ఉంచుకోగలిగాడంటే.. ఇక ఒక్క హిట్టు పడితే తన కెరీర్‌కి ఫుల్ స్వింగ్ వచ్చేస్తుందని రోహిత్‌కీ తెలుసు. అందుకే ఈ సినిమాపై రోహిత్‌కి అన్ని ఆశలు.
తన క్యారెక్టర్‌తో పాటు తారకరత్న పాత్ర కూడా స్ట్రాంగ్‌గా ఉండడంతో.. ఈ సినిమాపై హోప్ప్ పెంచుకొన్నాడు. సాయి కొర్రపాటి హ్యాండు కూడా కలిసొస్తుందన్న నమ్మకం కూడా ఉంది. రోహిత్ మార్కెట్‌ని పట్టించుకోకుండా ఈ సినిమాపై సాయికొర్రపాటి భారీగా ఖర్చుపెట్టారని, సినిమాలా లావీష్ గా తీశారని ట్రైలర్లు చూస్తే అర్థమైపోతుంది. మరి.. ఈ రాజా అయినా రోహిత్‌కి హిట్టిస్తాడేమో చూడాలి. అన్నీ ఉన్నా.. అంగట్లో శని అన్నట్టు ఈ ఫ్లాపుల భారీ నుంచి నారారోహిత్ని తప్పించే సినిమా ఎప్పుడొస్తుందో!