కొద్దిరోజులుగా లోఫర్ సినిమా నష్టాల గురించి అటు దర్శకుడు పూరి జగన్నాథ్ కు, డిస్ట్రిబ్యూటర్స్ కు గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పూరి ఏకంగా వారి వల్ల తన ప్రాణానికే హాని ఉందటూ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఇక డిస్ట్రిబ్యూటర్స్ ఏం తక్కువ తినలేదు.. ప్రెస్ మీట్, టివిల్లో ఇంటర్వ్యూస్ ఇచ్చి నానా హంగామా చేశారు. అయితే ఎట్టెకేలకు ఈ వ్యవహారానికి లోఫర్ హీరో వరుణ్ తేజ్ ముగింపు పలికాడట.
తన సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కు తను చేయబోతున్న మిస్టర్ సినిమా ఇచ్చేట్టు వారితో మాట్లాడాడట వరుణ్ తేజ్. అయితే లోఫర్ నిర్మాత, మిస్టర్ నిర్మాత వేరే అయినా దర్శకుడు శ్రీనువైట్ల సహాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి లోఫర్ గొడవ వరుణ్ తేజ్ జోక్యం చేసుకుంటే కాని ఓ కొలిక్కి రాలేదన్నమాట. కేవలం మూడు సినిమాల అనుభవమున్నా సరే డిస్ట్రిబ్యూటర్స్ బాగుంటేనే పరిశ్రమ బాగుంటుంది అని కనిపెట్టిన వరుణ్ తను శ్రీనువైట్ల తో చేస్తున్న సినిమా లోఫర్ డిస్ట్రిబ్యూటర్స్ కు అవకాశం ఇవ్వడం మెచ్చుకోదగ్గ విషయమే.