బాలయ్య బాబు వందో సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శారకర్ణి చరిత్రతో వస్తున్న బాలకృష్ణ సినిమాను చరిత్రలో నిలిచిపోయేలా చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబందించిన పనుల్లో దర్శకుడు క్రిష్ తలమునకలవుతున్నాడు. అయితే సినిమా ఓపెనింగ్ ను కూడా హీరోయిన్ లేకుండానే కానిచ్చేసిన చిత్రయూనిట్ ఇప్పుడు సీరియస్ గా కథానాయిక వేటలో ఉందట. మొన్నటిదాకా నయనతార, కాజల్ అంటూ పేర్లు వినపడ్డా వారు ఎవరు ఈ సినిమాలో చేసేందుకు సుముఖంగా లేరన్నది ఫ్రెష్ అప్డేట్.
అందుకే శాతకర్ణి సినిమాలో హీరోయిన్ గా జేజెమ్మను అడుగుతున్నారట. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తన సత్తా చాటుతున్న అనుష్క కమర్షియల్ సినిమాలకు లక్కీ హీరోయిన్ అయ్యింది. అందుకే ఈ చరిత్ర నేపథ్యంతో గల సినిమాలో కూడా అనుష్కను తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. క్రిష్ దర్శకత్వంలో ఆల్రెడీ అనుష్క వేదం సినిమాలో నటించింది. ఆ చనువుతో శాతకర్ణి గురించి అడుగగా ఆమె ఓకే అన్నదని టాక్. అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు కాని గౌతమిపుత్ర శాతకర్ణిలో అనుష్క హీరోయిన్ గా ఓకే అయినట్టే.