చిరంజీవి అభిమానుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. చిరు 150వ చిత్రాన్ని ఇటీవలే లాంఛనంగా మొదలెట్టేశారు. చిరు సినిమా ఉంటుందా, లేదా.. అనే అనుమానాలకు చిరు తెర దించేసిట్టైంది. ఇప్పుడు అందరి కళ్లూ కత్తి రీమేక్‌పైనే. ఈ సినిమా ఎలా ఉండబోతోంది? చిరుఎలా కనిపించబోతున్నాడు? అనే విషయాలపై చిరు అభిమానులు ఆసక్తికరంగా మాట్లాడుకొంటున్నారు. ఈ సినిమా ఇటు చిరుసినీ కెరీర్‌కీ, అటు రాజకీయ ప్రస్థానానికీ ప్లస్ అయ్యేలా ఉండే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెప్పుకొంటూ వచ్చాయి. చిరు ఈ సినిమాని తన పొలిటికల్ మైలేజీ కోసం ఉపయోగించుకొంటాడని భావించారు.
అయితే.. ఈ విషయంలో చిరు పక్కాగా ఉన్నాడట. తన సినిమాలో పొలిటికల్ డైలాగులు, రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన డైలాగులూ ఉండకూడదని స్పష్టంగా చెప్పాడట. దాంతో వినాయక్ కూడా ఆ జాగ్రత్తలు తీసుకొంటూనే స్ర్కిప్టు రూపొందించినట్టు తెలుస్తోంది. కత్తి రీమేక్‌లో పరుచూరి బ్రదర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని, అందుకే పొలిటికల్ సెటైర్లు హోరెత్తుతాయని భావించారంతా. కానీ… చిరు నిర్ణయంతో అలాంటి డైలాగులకు చెక్ పడినట్టైంది. ఫక్తు కమర్షియల్, మాస్ మసాలా సినిమాలానే ఉండబోతోందన్నమాట.