కట్ .. కాపీ .. పేస్ట్ – టాలీవుడ్లో ఈ వ్యవహారం మహా రంజుగా నడుస్తోంది. ఏ కొరియన్ సినిమానో, ఇరానీ సినిమానో చూడ్డం. అందులో పాయింట్ యాజ్ టీజ్‌గా ఎత్తేయడం ఇదీ.. పరిస్థితి. కాదేదీ కాపీని అనర్హం అన్న లెవిల్లో దర్శకులు రెచ్చిపోతున్నారు. కాపీ కొట్టడం ఓ కళ అంటూ.. బిల్డప్పు ఇస్తుంటారు. కథలు, సన్నివేశాలు కాపీ కొట్టారంటే అర్థం ఉండొచ్చు. ఇప్పుడు ఏకంగా బైకుల్ని కూడా కాపీ కొట్టేస్తున్నారు. ఇటీవల బ్రహ్మోత్సవం సినిమాకి సంబంధించి ఓ మోషన్ పోస్టర్ ఒకటి బయటకు వచ్చింది. మూడు చక్రాల బైక్ మీద కూర్చుని మహేష్ దూసుకుపోతున్న స్టిల్ అది. బైకు చూడగానే… ఇదేదో గమ్మత్తుగా ఉందే అనుకొన్నారంతా. అయితే అదీ కాపీ ఐడియానే అన్నది తేలిపోయింది.
రాజస్థాన్ టూరిజానికి సంబంధించిన ఓ వీడియోలో ఇలాంటి బైకే వాడారు. సారీ… అందులో వాడిన బైకే ఇక్కడ కాపీ కొట్టారు. పెట్రోల్ ట్యాంక్‌పై కనిపిస్తున్న హిందీ అక్షరాలతో సహా.. యాజ్ టీజ్ దింపేశారు. కాకపోతే ఆ బైకుమీద ఆరుగురు ఎక్కితే.. ఈ బైకు మీద మహేష్ ఒక్కడే సోలోగా వచ్చాడు. మనవైన కథల్ని, మనవైనబంధాల్ని తెరపై ఆవిష్కరించే శ్రీకాంత్ అడ్డాల ఈసారి ఇలా కాపీ బైకు ని ఎంచుకొన్నాడెందుకో? బైకు సంగతి ఎలా ఉన్నా… ఓ మంచి కథ చెప్పి, అందులో మహేష్‌కి బ్రహ్మాండంగా చూపిస్తే సంతోషపడిపోతారు సినీ జనాలు. ఇప్పుడు మహేష్ అభిమానులకూ అదే కదా కావాల్సింది. బైకు ఐడియా కాపీ అయినా.. దానిపై మహేష్ కూర్చున్నాడు కాబట్టి… ఆ స్టిల్లూ బాగానే ఉంది లెండి.