ఎంటర్టైన్మెంట్… ఎంటర్టైన్మెంట్… ఎంటర్టైన్ మెంట్… ప్రేక్షకులకు కావల్సింది ఇదే! సినిమా అంటేనే వినోదం… రెండున్నర గంటల పాటు బయట ప్రపంచాన్ని మర్చిపోయేలా చేసే సాధనం. అందుకే దర్శకులు కూడా వినోదాత్మక చిత్రాల్ని అందించడం వైపే దృష్టిసారిస్తుంటారు. అయితే.. అవార్డుల కోసమో, లేదంటే పేరు ప్రతిష్టల కోసమో సెంటిమెంట్ పిండేసే పాత్రల్ని చేయడానికి ఇష్టపడుతుంటారు కథానాయికలు. అయితే తమన్నా మాత్రం.. తాను ఆటైపు సినిమాల్ని అస్సలు ఇష్టపడను అంటోంది. ”ఏడుపు గొట్టు సినిమాల్ని నేను చూడను.. అలాంటి సినిమాల్లో నటించను” అంటూ ఓ భారీ స్టేట్మెంట్ ఇచ్చేసింది.
”సినిమాకొచ్చేది కాసేపు రిలాక్స్ అవ్వడానికి మాత్రమే. ఆ టైమ్ లో ప్రేక్షకుల్ని ఏడిపించడం ఎందుకు?? బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో అయితే అలాంటి సినిమాల్ని చూసేవారేమో. ఇప్పటి జనాలకు అంత ఓపిక లేదు.. సెంటిమెంట్ తో పిండేయాలని చూస్తే అలాంటి సినిమాలకు ఫ్లాప్స్ తప్పవు. అందుకే నేను అలాంటి కథల్ని ఎంచుకోను గాక ఎంచుకోను..” అంటోంది తమన్నా.