పవన్ కల్యాణ్ రాజకీయాల్లో రాణిస్తాడా? జనసేనను జనం మధ్యకు తీసుకెళ్లగలడా? అన్నయ్య స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలానే జనసేన మారబోతోందా?? పవన్ అభిమానుల్లో ఎక్కడో ఏదో చోట ఇలాంటి అనుమానాలు ఉండడం సహజం. పవన్ పార్టీపై ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ… దాసరి నారాయణరావు మాత్రం ఇప్పటి వరకూ నోరు మెదపలేదు. తొలిసారి పవన్ పార్టీపై దాసరి నోరు విప్పారు. ”పవన్ రాజకీయాల్లోనూ రాణిస్తాడన్న నమ్మకం నాకుంది” అంటూ పవన్‌ని వెనకేసుకొచ్చారు. ”ఇచ్చిన మాటపై నిలబడే మనస్తత్వం పవన్‌కి ఉంది. ఆ నిజాయతీ చాలామందికి నచ్చింది. అందుకే అతని వెంట అంతమంది ఉన్నారు” అంటూ తొలిసారి పవన్ పార్టీపై స్పందించారు.
ఈరోజు సాయింత్రం దాసరి తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా పవన్ పార్టీ ప్రస్తావన వచ్చింది. రాజకీయాల కోసం పవన్ సినిమాలకు దూరం అవుదామనుకొంటున్నాడు. దీనిపై మీ వ్యాఖ్యలేంటి? అని ప్రశ్నిస్తే.. ”రెండు పడవల ప్రయాణం మంచిది కాదు. అందుకే పవన్ ఆ నిర్ణయం తీసుకొని ఉంటాడ”ని చెప్పుకొచ్చారు దాసరి. త్వరలోనే పవన్‌తో దాసరి సినిమా మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే పవన్ పై దాసరి పాజిటివ్ వ్యాఖ్యలు చేసుండొచ్చనుకొంటున్నారు ఫిల్మ్‌నగర్ వర్గాలు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు గట్టిగా వ్యతిరేకగళం వినిపించిన దాసరి.. తమ్ముడు పవన్‌ని సపోర్ట్ ఇవ్వడం మెగా ఫ్యాన్స్‌ని సైతం ఆశ్చర్యపరిచే విషయమే.