పవన్ కల్యాణ్ పేరుని నితిన్ వాడుకొన్నంతగా మరో హీరో వాడుకోలేదేమో.?? తన ఆడియో ఫంక్షన్లకూ పవన్‌ని గెస్ట్‌గా పిలిపించుకొనే ఘనత నితిన్‌కే దక్కింది. పవన్ పాటల్ని, పవన్ పాటల్లో టైటిళ్లనూ, పవన్ డైలాగులన్నీ వాడేసి పవన్ అభిమానుల్ని కూడా తన అభిమానులుగా మార్చుకొన్న నితిన్… తన తొలి సినిమాకి పవన్ ని ఎలా వాడుకొన్నదీ అఆ ఆడియో ఫంక్షన్లో బయటపెట్టాడు.
నితిన్ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం జయం. ఆ సినిమా ఆడిషన్స్ కోసం నితిన్‌ని పిలిచి ‘నీకు డాన్స్ వచ్చా’ అని అడిగితే వవన్ సినిమా తమ్ముడులోని స్టెప్పులు వేసి చూపించాడట నితిన్. మరుసటి రోజు డైలాగులు చెప్పమంటే.. తొలిప్రేమలోని శకుంతలక్కయ్యా సీన్‌ని యాజ్ ఇట్ ఈజ్ దింపేశాడట. అవి చూసే దర్శకుడు తేజ కూడా ముగ్థుడైపోయి.. నితిన్‌కి హీరోగా అవకాశం ఇచ్చారట. ఈ విషయాన్నీ నితినే స్వయంగా చెప్పుకొచ్చాడు. అంటే తన అంగేట్ర చిత్రానికి కూడా పవన్‌ని బాగా వాడేసుకొన్నాడన్నమాట.